ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకోవడంతో మండే ఎండలను కూడ లెక్కచేయకుండా రాజకీయనాయకుల నుండి వివిధ పార్టీల కార్యకర్తల వరకు విపరీతంగా శ్రమ పడుతూ విజయమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎంతోమంది ప్రముఖులు పోటీలో ఉన్నప్పటికీ అందరి దృష్టి మాత్రం పవన్ కళ్యాణ్ పై ఉంది.


గత ఎన్నికలలో గాజువాక భీమవరం స్థానాల నుండి పోటీ చేసి పవన్ ఒడిపోవడంతో  ఈసారి ఎన్నికలలో పవన్ తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకోవడం అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. జనసైనికుల అంచనాల ప్రకారం పవన్ పిఠాపురం నుండి లక్ష ఓట్ల మెజారిటీతో నెగ్గుతాడు అన్న అంచనాలు ఉన్నప్పటికీ వాస్తవానికి ఈ స్థానంలో పవన్ కు ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది అంటూ ఇప్పటి నుండే చర్చలు జరుగుతున్నాయి.


దీనికితోడు పవన్ ఏరికొరి పిఠాపురం ఎందుకు ఎంచుకున్నాడు అన్న విషయమై ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఆశక్తికర కామెంట్స్ చేశాడు. పవన్ కు పీఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటే చాల ఇష్టం అనీ అంతేకాకుండా ఆయన అంటే పవన్ కు బాగా నమ్మకం అనీ ఆ సెంటిమెంట్ తోనే పవన్ పిఠాపురం ను ఎంచుకున్నాడు అంటూ పవన్ ఎంపిక వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాడు.


నాగబాబు మాటలలో పవన్ ఆధ్యాత్మిక నమ్మకాలు ఉన్నప్పటికీ పిఠాపురంలో పవన్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సుమారు 60 వేల వరకు ఉన్నట్లుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో పిఠాపురం తనకు అన్ని విధాల కలిసి వస్తుందని పవన్ ఎత్తుగడ అనుకోవాలి. రానున్న ఎన్నికల సమరంలో ఏపార్టీ విజయం సాధించినప్పటికీ ఆ ఫలితాలు తరువాత ఏపార్టీ అభిమాని అయినప్పటికీ పిఠాపురంలో పవన్ నెగ్గాడ లేదా అన్నవిషయం చాల ఆసక్తిగా తెలుసుకుంటారు అన్నది వాస్తవం కావడంతో రానున్న ఎన్నికలలో పవన్ ఎన్నికల ఫలితం హాట్ టాపిక్ అవనున్నది..  


మరింత సమాచారం తెలుసుకోండి: