తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో జయం రవి ఒకరు. జయం రవి ఇప్పటికే అనేక సినిమాలలో హీరోగా నటించి కోలీవుడ్ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కొంతకాలం క్రితం మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వాన్ 1 మరియు పార్ట్ 2 లలో కీలక పాత్రలలో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా జయం రవి "సైరన్" అనే సినిమాలో హీరోగా నటించాడు. 

మూవీ లో కీర్తి సురేష్ , అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలలో నటించగా ... సముద్ర ఖని ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దానితో ఈ సినిమా యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా 19 వ తేదీ నుండి తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేస్తుంది. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తన నటనతో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jr