రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి మూవీలోను ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ లోనూ హీరోగా నటిస్తున్నాడు. రాజా సాబ్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగే ఇప్పటికే పూర్తి అయ్యింది. కాకపోతే ఈ మూవీ నుండి చిత్ర బృందం ప్రభాస్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను మినహాయిస్తే ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు.

ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్డేట్ రాబోతోంది అని కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ వార్తలపై రాజా సాబ్ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి టీజీ విశ్వ ప్రసాద్ స్పందించాడు ...  రాజా సాబ్ మూవీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్ తాజాగా మాట్లాడుతూ ... ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ మరియు కల్కి 2898 ఏడి మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న కల్కి సినిమా విడుదల అయిన తర్వాతే రాజా సాబ్  మూవీ కి సంబంధించిన సాంగ్ ... టీజర్ అప్డేట్ లను తెలియజేస్తాం అంత వరకు ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లు బయటకు వచ్చే అవకాశం లేదు అని ఈయన చెప్పేసాడు. దానితో ఇప్పట్లో రాజా సాబ్ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు అనే విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక రాజా సాబ్ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నీది అగర్వాల్ , మాళవిక మోహన్ ,  రీద్దీ కుమార్ లు కనిపించనుండగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: