మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించాడు. ఇక కొంతకాలం క్రితమే ఈయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టడం అలాగే ఈ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా రావడంతో చరణ్ కి ఈ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ లభించింది. ఇక ప్రస్తుతం ఈయన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలోనే హీరోగా నటించడానికి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నాడు.

అందులో భాగంగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే భారీ బడ్జెట్ ఇండియా పాన్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన నార్త్ థియేటర్ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ నార్త్ థియేటర్ హక్కులను ఏఏ ఫిలిమ్స్  అధినేత అనిల్ తడని దక్కించుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈయన ఈ సినిమా యొక్క నార్త్ థియేటర్ హక్కులను ఏకంగా 75 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క నార్త్ ఏరియా నుండి ఈ సినిమాకు భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత చరణ్ , బుచ్చిబాబు సన దర్శకత్వం లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: