టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా... బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీలో సైఫ్ అలి ఖాన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తూ ఉండగా ... ఈ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఈ మూవీకి సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మివేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను మరియు నార్త్ హక్కులను అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ 130 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా యొక్క నార్త్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దాదాపుగా 50 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల మరియు నార్త్ హక్కులతోనే 130 కోట్ల భారీ ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీకి డిజిటల్ , సాటిలైట్ , మ్యూజిక్ హక్కులతో దాదాపు 400 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఎన్టీఆర్, కొరటాల కాంబోలో జనతా గ్యారేజ్ మూవీ రూపొంది సూపర్ సక్సెస్ కావడంతో దేవర మూవీపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: