విజయ్ దేవరకొండ..రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ గా అంచనాలు అందుకోలేక 28 కోట్ల పైగా లాస్ తో డిజాస్టర్ మూవీగా నిలిచింది. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే అనుకున్న తేదీ కన్నా ముందే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తునట్లు సమాచారం తెలుస్తోంది. మే3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అప్డేట్ అనేది రానుంది. ఇన్నాళ్లు ఫ్యామిలీ స్టార్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ సినిమా  చేస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది. శ్రీలీల హీరోయిన్ గా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ అవ్వక శ్రీలీల.. ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆమె ప్లేస్ లో మమిత బైజు, భాగ్యశ్రీ బొర్సే పేర్లు కూడా ఆ మధ్య వినిపించాయి. కానీ హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.


ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో దేవరకొండపై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ షూట్ చేశారు మేకర్స్.త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కానున్నట్లు సమాచారం. అందుకు గాను మూవీ టీమ్ అంతా వైజాగ్ కు వెళ్లనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి కొద్ది రోజుల పాటు అక్కడ ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు మేకర్స్. దీనిపై అఫీషియల్ అప్డేట్ ని ఇవ్వనున్నారు. ఇటీవల వైజాగ్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇంకా నితిన్ తమ్ముడు మూవీల షూటింగ్ జరిపారు మేకర్స్. ఇక ఇప్పుడు VD 12 టీమ్ కూడా అక్కడికే వెళ్లనుంది.భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కి డియర్ కామ్రేడ్ నుంచి ఫ్యామిలీ స్టార్స్ దాకా అన్ని ఫ్లోపులే.. ఖుషి సినిమాకి 10 కోట్ల పైగా నష్టం రాగా, లైగర్ సినిమాకి 60 కోట్ల పైగా నష్టం వచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కి 28 కోట్ల పైగా నష్టం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: