మాస్ మహారాజా రవితేజ హీరోగా అనుష్క హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా "విక్రమార్కుడు 2" మూవీ ఉండబోతుంది అని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ పనులను విక్రమార్కుడు సినిమా కథ రచయిత అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు పూర్తి చేశారు అని ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుండి ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా *విక్రమార్కుడు 2" కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను నిర్మాత రాదా మోహన్ చెప్పారు.

ఆయన తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన "విక్రమార్కుడు 2" మరియు "బజరంగీ భాయిజాన్ 2" మూవీ లకు సంబంధించిన క్రేజీ వివరాలను తెలియజేశారు. తాజా ఈవెంట్ లో భాగంగా నిర్మాత రాదా మోహన్ మాట్లాడుతూ ... రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన విక్రమార్కుడు సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సీక్వెల్ చేద్దాము అని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అందులో భాగంగా విజయేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికే ఆ మూవీ సీక్వెల్ కి సంబంధించిన స్టోరీని మొత్తం కంప్లీట్ చేశారు. నటీనటులను ఎంపిక చేస్తున్నాం.

అన్ని కుదిరితే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా యొక్క సీక్వెల్ కు సంబంధించిన అఫిషియల్ ప్రకటనను విడుదల చేస్తాం అన్నారు. అలాగే "బజరంగీ భాయిజాన్ 2" కు సంబంధించిన కథను కూడా ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ గారు రెడీ చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఆ కథను సల్మాన్ ఖాన్ కి వివరిస్తాం. ఆయన కనుక ఆ కథ విని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ సినిమా కూడా సెక్స్ పైకి వెళుతుంది అని నిర్మాత రాధామోహన్ తాజా ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm