మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లి పోయింది . టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా చాలా సినిమాలలో నటించి తమిళ ఇండస్ట్రీ లో కూడా మంచి స్థాయికి చేరుకుంది. ఇక ప్రస్తుతం మాత్రం ఈమె తెలుగు సినిమాల్లో నటించడం లేదు. 

కేవలం తమిళ , హిందీ సినిమాలలో మాత్రమే నటిస్తూ వస్తోంది. తెలుగు లో ఈమె కొండపొలం అనే సినిమాలో చివరగా నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఈమె ఏ తెలుగు సినిమాలో కూడా నటించలేదు. అలాగే ఏ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఈమె తమిళ్ లో తాజాగా "ఇండియన్ 2" సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. అలాగే అనేక హిందీ సినిమాల్లో కూడా ఈమె ప్రస్తుతం నటిస్తోంది. 

ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఉన్నటువంటి ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rps