కొన్ని సంవత్సరాల క్రితం వరకు సౌత్ ఇండియా నుండి అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన సినిమా విడుదల అవుతోంది అంటే సౌత్ ఇండియా మొత్తం ఆయన సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉండేది. ఆయన మూవీ లలో కూడా కంటెంట్ అదే రేంజ్ లో ఉండేది. ఎప్పుడు కొత్త రకం స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకునేవాడు. శంకర్ కి తెలుగులో కూడా అదిరిపోయే రేంజ్ గుర్తింపు ఉంది. శంకర్ సినిమా వస్తుంది అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

అలాగే శంకర్ మూవీ లకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ దక్కుతూ ఉంటాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం శంకర్ క్రేజ్ కాస్త తగ్గింది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే రోబో సినిమా తర్వాత ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు ఏవి కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం శంకర్ , రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ ని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ కి సంబంధించిన వ్యక్తులు చెప్తూ వస్తున్నారు.

సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. అయినా ఈ మూవీ షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం ... శంకర్ గత సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించకపోవడంతో ఈ సినిమాపై క్రేజ్ కాస్త తగ్గుతుందేమో అని జనాలు అనుకున్నారు. కాకపోతే "ఆర్ ఆర్ ఆర్" లాంటి మూవీతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న చరణ్ ఈ మూవీలో హీరోగా నటిస్తూ ఉండడం ... అలాగే చరణ్ నెక్స్ట్ మూవీ లపై కూడా ఇప్పటి నుండే స్ట్రాంగ్ బజ్ ఉండడంతో గేమ్ చేంజర్ మూవీ కి భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. దానితో శంకర్ క్రేజ్ కు మించి చరణ్ స్టామినా గేమ్ చేంజర్ సినిమాను నిలబెడుతుంది అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: