టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ప్రభాస్ తన కెరీర్ తొలినాళ్లలో నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో వర్షం మూవీ ఒకటి. 2004 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ టైం లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఒక్క సారిగా ప్రభాస్ రేంజ్ చాలా పెరిగింది. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించగా ... శోభన్ ఈ మూవీ కి శోభన్ దర్శకత్వం వహించాడు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎమ్ ఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో గోపీచంద్ విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ లో జంటగా నటించిన ప్రభాస్ , త్రిష జోడీకి అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే వీరిద్దరి కెమిస్ట్రీ కి కూడా ఆ సమయంలో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ తో త్రిష క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత ఈమె వరస అవకాశాలను దక్కించుకొని తెలుగు లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇంతలా త్రిష కెరియర్ ను ఇంతలా మార్చిన వర్షం సినిమాలో మొదటి ఆఫర్ ఈమెకు రాలేదట.

ఒక ముద్దుగుమ్మను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారట. కాకపోతే చివరగా త్రిష కు ఈ ఆఫర్ వెళ్లిందట. ఇకపోతే మొదట వర్షం సినిమాలో హీరోయిన్ గా అనుకున్నది ఎవరో కాదు అప్పటి యువ హీరోయిన్ అయినటువంటి అదితి అగర్వాల్. గంగోత్రి సినిమాలో తన నటనతో అందాలతో ఈ బ్యూటీ ప్రేక్షకులను బాగా అలరించడంతో ఈమెను వర్షం సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలి అని ఈ మూవీ బృందం అనుకుందట. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈమె స్థానంలో త్రిష ను ఈ చిత్ర బృందం వారు సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: