యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన తనకు ఎలాంటి పాత్రను ఇచ్చినా కూడా దానిని అవలీలగా చేస్తూ ఉంటాడు. దానితో ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న గొప్ప నటులలో ఎన్టీఆర్ కూడా ఒకరు అనే పేరును ఈయన సంపాదించుకున్నాడు. ఇంత గొప్ప నటన ఈయనలో ఉన్నా కూడా ఆ నటనను వాడుకునే దర్శకులే కరువైపోయారు. ఎప్పుడో తప్పితే ఎన్టీఆర్ నటనను బాగా వాడుకున్న దర్శకులే చాలా తక్కువ అని చెప్పవచ్చు.

ఇకపోతే ఎన్టీఆర్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్ "అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ నటన గురించి ఈ మూవీ కెమెరామెన్ అయినటువంటి సెంథిల్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా సెంథిల్ మాట్లాడుతూ ... "ఆర్ ఆర్ ఆర్" మూవీ లోని ఎన్టీఆర్ ఇంట్రో సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సీన్ తీస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు షాట్ రెడీ అనగానే ఎంతో వేగంగా పరిగెత్తడం చూసిన అక్కడ ఉన్న యూనిట్ సభ్యులు అంతా షాక్ అయ్యారు అని సెంథిల్ అన్నారు.

ముఖ్యంగా ఆ సీన్ లో వచ్చే తోడేలు , పులి కంటే కూడా ఆయన మరింత వేగంగా పరిగెత్తారని సెంథిల్ అన్నారు. అంత స్పీడ్ గా ఎలా పరిగెత్తగలరు అని అడుగగా ... నేను గతంలో జూనియర్స్ విభాగంలో నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఆడానని , అందుకే ఎప్పుడూ ఫిట్ గా ఉండేలా చూసుకుంటానని ఎన్టీఆర్ చెప్పడం విని ఆశ్చర్యం పోయాం అని సెంథిల్ అన్నారు. మొత్తంగా ఒక పాత్ర కోసం ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని సెంథిల్ కుమార్ తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: