ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటులలో ప్రియదర్శి ఒకరు. ఈయన పెళ్లి చూపులు మూవీ తో కెరీయర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తో మా సూపర్ క్రేజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు . అందులో భాగంగా ఈయన ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఈయన హీరోగా నటించిన సినిమాలు కూడా ఎన్నో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈయన హీరోగా కూడా కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రియదర్శి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి అయినటువంటి నభా నటేష్ హీరోయిన్ గా రూపొందబోయే డార్లింగ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నభా నటేష్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ప్రభాస్‌ ఎక్కువగా వాడే డార్లింగ్ అనే పదాన్ని , స్లాంగ్ అనుకరించింది. ప్రియదర్శి , నభా ను డార్లింగ్ అని పిలిచి సరదాగా ఆట పట్టించాడు. ఇదేదో సినిమా ప్రమోషన్ అయి ఉంటుంది అని చాలా మంది భావించారు.

ఇక చాలా మంది ప్రేక్షకులు అనుకున్నట్లు ఇది సినిమా ప్రమోషన్ లలో భాగంగా చేసిన వీడియోనే. ప్రియదర్శి , నభా నటేష్ హీరో , హీరోయిన్ లుగా ప్రస్తుతం డార్లింగ్ అనే మూవీ తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ దర్శకుడు అశ్విన్‌రామ్‌ ఈ మూవీ కి దర్శకత్వం వహించనున్నాడు. ఇకపోతే చాలా కాలం గ్యాప్ తర్వాత నబా నటేష్ , నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: