‘పెళ్లి చూపులు’ మూవీతో పరిచయమైన ప్రియదర్శి ‘జాతిరత్నాలు’ మూవీతో మంచి కెరియర్ బ్రేక్ అందుకున్నాడు. ‘మల్లేశం’ లాంటి సీరియస్ మూవీలో నటించి ఇతడు మెప్పించడంతో అన్ని రకాల   పాత్రలను ఇతడు నటించి మెప్పించగలడు అన్నపేరు  తెచ్చుకున్నాడు. అయితే సోలో హీరోగా ఇతడు నటించి కమర్షియల్ హిట్ అందుకున్న సినిమా ఇంతవరకు రాలేదు.  


లేటెస్ట్ గా ఇతడు నటించిన ‘ఓం భీం బుష్’ కూడ ఒక మోస్తరుగా ఆడిందే తప్ప కలెక్షన్స్ పరంగా అద్భుతాలు చేయలేకపోయింది. ఇలాంటి  పరిస్థితుల మధ్య ప్రియదర్శి సోలో హీరోగా ఒక సినిమా రాబోతోంది  ఆసినిమాకు డార్లింగ్’ అన్న టైటిల్ ఫైనల్ చేశారు. ఈ టైటిల్ వినగానే  ఎవరికి అయిన వెంటనే హీరో  ప్రభాస్ గుర్తుకు వస్తాడు. ఈమూవీలో ప్రియదర్శి పక్కన నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.


‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ ఆ హిట్ ను తన కెరియర్ కు ఉపయోగించలేకపోయింది అన్న కామెంట్స్ ఈమె పై ఉన్నాయి. ‘డార్లింగ్’ సినిమాకు తమిళ డైరెక్టర్ అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈమూవీ రెగ్యులర్ రొటీన్ సినిమాల కథకు భిన్నంగా ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రియదర్శి లాంటి చిన్న హీరో సోలో హీరోగా నటించిన సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలి అంటే చాల కష్టమైన పని. ఈ కారణంతో ఈమూవీ పబ్లిసిటీని చాల డిఫరెంట్ గా చేస్తున్నారు.


ప్రస్తుతం విడుదల అవుతున్న చిన్న సినిమాలలో కొన్ని చిన్న సినిమాలు  ఊహించని ఘన విజయం సాధిస్తున్నాయి. కధలో కొత్త పాయింట్ ఉంటేచాలు. అలాంటి సినిమాలను  ప్రేక్షకులు విపరీతంగా  ఆదరిస్తున్నారు.  ఈసమ్మర్ రేస్ లో చెప్పుకోదగ్గ భారీ సినిమాలు  ఏమి  లేకపోవడంతో ఈ సమ్మర్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ  చిన్న హీరో కూడ వస్తున్నాడు. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేస్తే  ప్రభాస్ టైటిల్ ప్రియదర్శికి  కలసి వచ్చింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: