హీరో శర్వానంద్ కొంతకాలం క్రితం సంక్రాంతి హీరోగా ప్రతి సంవత్సరం హిట్ కొట్టిన ట్రాక్ రికార్డు అతడికి ఉంది. ఆతరువాత వరసపెట్టి ఫ్లాప్ లు లు అతడిని వెంటాడటంతో అతడి కెరియర్ కు బ్రేక్ పడింది. అయితే గత సంవత్సరం విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ మూవీ హిట్ అవ్వడంతో తిరిగి ఈహీరో ట్రాక్ లో పడుతున్నాడు అని అంటున్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీస్తున్న ‘మనమే’ మూవీలో శర్వానంద్ హీరోగా నటిస్తూ ఉంటే ఫ్లాప్ ల హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.


ఈసినిమా ప్రారంభం అయి చాలకాలం అయినప్పటికీ ఎట్టకేలకు ఈమూవీని సమ్మర్ రేస్ లో విడుదల చేయబోతున్నారు. తెలిసిన సమాచారం మేరకు ఈమూవీని వచ్చేనెల మూడవ వారంలో ఎన్నికల హడావిడి పూర్తి అయిన తరువాత విడుదల చేస్తారని సంకేతాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈమూవీ టీజర్ చాల ఆశక్తి దాయకంగా ఉండటంతో ఈమూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి.


ఈసినిమాలో మంచివాడిలా కనిపించే శర్వానంద్ కు తాను మంచి వాడిని కాను అన్న విషయం అతడికి తెలుసట. సరదాగా జీవితం గడుపుతూ జాలీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న అతడి జీవితంలోకి కృతి శెట్టి ఎంట్రీ ఇస్తుంది. వారిద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారుత్తుబోతున్న పరిస్థితులలో అనుకోకుండా ఒక చిన్న అబ్బాయి ఎంట్రీ ఇస్తాడాట. అయితే ఆ పిల్లాడు ఎవరు అతడికీ శర్వానంద్ కీ ఉన్న సంబంధం ఏమిటీ అన్న పాయింట్ చుట్టూ ఈమూవీ కథ ఉంటుందని సమాచారం.


సంక్రాంతి తరువాత సరైన సినిమా లేకపోవడంతో ధియేటర్లు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. టాప్ హీరోల సినిమాలు ఏవీ సమ్మర్ రేస్ కు లేకపోవడంతో ఈ సంవత్సరం సమ్మర్ రేస్ ఎటువంటి సందడి లేకుండా నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాబోయే నెలలో విడుదలకాబోతున్న ‘మనమే’ కి పాజిటివ్ టాక్ వస్తే శర్వానంద్ తో పాటు కృతి శెట్టి కూడ అదృష్టవంతురాలు అవుతుంది..  మరింత సమాచారం తెలుసుకోండి: