సూపర్ స్టార్ మహేష్ బాబుకు సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను తెచ్చి పెట్టిన సినిమాల్లో ఒక్కడు ప్రధానమైన సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన ఒక్కడు సినిమా టాలీవుడ్‌ లో అప్పటి దాకా ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.అప్పట్లోనే భారీ బడ్జెట్‌ తో రూపొంది, భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో చూపించిన ప్రతి పాయింట్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. అందుకే ఒక్కడు భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్కడు సినిమా తెలుగు లో పెద్ద హిట్‌ అయిన నేపథ్యంలో తమిళంలో విజయ్ హీరోగా గిల్లీ పేరుతో రీమేక్‌ చేశారు.విలన్‌ గా ప్రకాష్ రాజ్‌ నే కొనసాగించి, హీరోయిన్ గా భూమిక ప్లేస్ లో త్రిషను నటింపజేశారు. కథ, కథనం ఏ మాత్రం మార్చకుండా మక్కీకి మక్కీ పూర్తిగా దించేశారు. అయినా కూడా తెలుగు ఒక్కడు వచ్చిన రేంజ్ లో గిల్లీ సినిమా రాలేదు అనేది అప్పుడే కాదు ఇప్పటి సినీ విశ్లేషకుల వాదన కూడా. గిల్లి సినిమాలో విజయ్ సీన్స్ ని మన ఒక్కడుతో పోల్చుతూ మనోళ్లు చాలా ఘోరంగా విజయ్ ని ట్రోల్ చేస్తారు.


ఒక్కడు కంటే 100 రెట్లు తక్కువ క్వాలిటీ ఉన్న గిల్లీ ని తమిళ ప్రేక్షకులు అప్పట్లో విపరీతంగా ఆదరించారు. ఇక రెండు దశాబ్దాల క్రితం వచ్చిన గిల్లీ సినిమాను తమిళనాట రీ రిలీజ్ చేశారు. భారీ ఎత్తున చేసిన ప్రచారం నేపథ్యంలో విడుదలకు రెండు రోజుల ముందే దాదాపుగా బుక్ మై షో ద్వారా 60 వేల టికెట్లు అమ్ముడు పోవడం జరిగింది.విడుదల సమయానికి లక్ష టికెట్లకు పైగా అమ్ముడు పోయాయి అంటూ సమాచారం తెలుస్తుంది.చెన్నై లో అయితే ఏకంగా 300 షో లు వేయడం జరిగింది.ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్‌ గిల్లీ సినిమాకు మరోసారి బ్రహ్మరథం పట్టారు. తమిళనాట భారీ ఎత్తున విడుదల అయిన గిల్లీ సినిమాకు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయినట్లు సమాచారం తెలుస్తుంది.మొత్తానికి మన ఒక్కడు సినిమాను తమిళ ప్రేక్షకులు ఓన్ చేసుకున్న విధానం చూస్తూ ఉంటే నిజంగా ముచ్చటేస్తుంది. తెలుగు లో హిట్‌ అయిన సినిమాలు చాలా తమిళనాట ప్లాప్ అయ్యి బొక్క బోర్లా పడ్డాయి. కానీ గిల్లీ మాత్రం అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుని, రీ రిలీజ్ లో కూడా అదరగొట్టడం మనకు మంచి విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: