రొటీన్ రొట్ట డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో అసలు పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఏంటని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా  షాక్ అయ్యారు. చాలా కాలం కూడా ఈ వార్త నమ్మలేదు. కానీ రాజా సాబ్ నుంచి వచ్చిన లీక్డ్ ఫోటోస్  చూసి ఫ్యాన్స్ మారుతితో సినిమా ఎందుకన్నా అంటూ సోషల్ మీడియాలో వాపోయారు. కానీ ఇక అఫీషియల్ గా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి పర్లేదు మారుతి ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడని అనుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో నిర్మిస్తున్న రాబా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్ ఇంకా నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ కథ థ్రిల్లర్ నేపథ్యంతో ఉంటుందని తెలుస్తుండగా మారుతి ఈ సినిమాను తన మార్క్ ఎంటర్టైనింగ్ పంథాలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. ప్రభాస్ కొంతకాలం నుంచి కేవలం సీరియస్ కథలనే చేస్తూ వస్తున్నాడు. ప్రభాస్ బుజ్జిగాడు లాంటి కామెడీ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. హీరో క్యారెక్టర్ అది కూడా స్టార్ హీరో జోవియల్ గా ఉంటూ కథను నడిపిస్తే చూడటానికి చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.


అయితే ప్రస్తుతం వస్తున్న రాజా సాబ్ లో  చాలా న్యాచురల్ గా వింటేజ్ ప్రభాస్ ని చూపించాలని చూస్తున్నాడట మారుతి. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ మాత్రం అదిరిపోతుందని మేకర్స్ చెప్పుకుంటున్నారు. మొదటి రెండు మూడు సినిమాలు పక్కన పెడితే మారుతి సినిమా అంటే ఫ్యామిలీ అంతా కూడా కడుపుబ్బా నవ్వుకునేలా తీస్తాడు.అందుకే ప్రభాస్ తో చేస్తున్న రాజా సాబ్ విషయంలో కూడా మారుతి తన మార్క్ కామెడీని బాగా వర్క్ అవుట్ చేయిస్తున్నాడని సమాచారం తెలుస్తుంది. రాజా సాబ్ ఫ్యాన్స్ కు ఓ పక్క మాస్ అంశాలతో ఫుల్ మీల్స్ పెడుతూనే మరోపక్క ఎంటర్టైనింగ్ గా ఉంటూ కితకితలు పెట్టిస్తుందని మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక చర్చి సెట్ లో సినిమా షూటింగ్ చేస్తున్నారు.రాజా సాబ్ 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఈసారి సంక్రాంతికి రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ మేనియా చూడబోతున్నామని చెప్పొచ్చు.ఫ్యాన్స్ తమ వింటేజ్ ప్రభాస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: