సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితమే గుంటూరు కారం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఫుల్ క్రేజ్ కలిగిన హీరోయిన్ లుగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ లీలా , మీనాక్షి చౌదరి ... మహేష్ కు జోడిగా నటించగా ... టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. జయరామ్ , రమ్యకృష్ణ , రావు రమేష్ , ప్రకాష్ రాజ్ , రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... చినబాబు , సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించారు.

ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల కంటే ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేసింది. అందులో కూర్చి మడత పెట్టి అంటూ సాగే సాంగ్ సినిమా విడుదలకు ముందే అద్భుతమైన ఫేమస్ అయ్యింది. ఇక సినిమా విడుదల అయిన తర్వాత ఈ పాటలో మహేష్ , శ్రీ లీల వేసిన డాన్స్ స్టెప్ లు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సాంగ్ మరింత ఫేమస్ అయ్యింది.

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లోని కుర్చీ మడత పెట్టి అంటూ సాగే వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. దీనికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. తాజాగా ఈ వీడియో సాంగ్ ఓ రేర్ మార్క్ వ్యూస్ ను టచ్ చేసింది. ఇప్పటి వరకు ఈ సాంగ్ కి యూట్యూబ్ లో 200 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇలా కుర్చీ మడత పెట్టి సాంగ్ యూట్యూబ్ లో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: