టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి సుకుమార్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఎంతో బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫజిల్మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క నార్త్ థియేటర్ హక్కులను కూడా అమ్మివేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ యొక్క నార్త్ థియేటర్ హక్కులకు ఇంత వరకు ఏ హిందియేతర సినిమాకి జరగని రేంజ్ లో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క నార్త్ థియేటర్ హక్కులకు ఏకంగా 200 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ... ఈ స్థాయి బిజినెస్ ఇప్పటివరకు ఏ ఇతర భాష సినిమాకు హిందీ ఏరియాలో జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ విడుదలకు ముందే హిందీ ఏరియాలో భారీ రికార్డును అందుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa