టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకరు. ఈయన కెరియర్ ను మొదలు పెట్టిన మొదటి సినిమా అయినటువంటి దేవదాస్ తోనే అద్భుతమైన కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు రామ్ చాలా విజయాలను అందుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో చాలా వెనకబడిపోయాడు.

కొంత కాలం క్రితం ఈ నటుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ అనే సినిమాలో హీరోగా నటించి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ.లో నిధి అగర్వాల్ , నబా నాటేష్ హీరోయిన్ లుగా నటించగా ... మెలోడీ బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఈ మూవీ కి సీక్వెల్ గా డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు.

మూవీ పై ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేయడం లేదు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మే నెలలో రామ్ పుట్టిన రోజు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను కానీ ఫస్ట్ సింగిల్ కానీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో వరుస అపజాయలను ఎదుర్కొంటున్న రామ్ డబుల్ ఈస్మార్ట్ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: