రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితమే సలార్ అనే భారీ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాలో జగపతి బాబు , పృధ్వీరాజ్ సుకుమారన్ , శ్రేయ రెడ్డి కీలకమైన పాత్రల్లో నటించగా .... ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో మొదటి భాగాన్ని పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

ఇప్పటికే థియేటర్ , "ఓ టి టి" ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన ఈ సినిమా ఈ రోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అల్లరించడానికి రెడీ అయ్యింది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను "స్టార్ మా" చానల్ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై స్టార్ మా చానల్ వారు ప్రసారం చేయనున్నారు. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: