ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీని చిన్న సినిమాలు రూల్ చేస్తున్నాయానే చెప్పాలి. లో బడ్జెట్ తో హై క్వాలిటీ కంటెంట్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్ళని నమోదు చేస్తూ సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు, మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న సినిమాలు అయితే వంద కోట్ల మార్క్ ని కూడా చాలా ఈజీగా అందుకొని అదుర్స్ అనిపిస్తున్నాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మ్యాడ్, టిల్లు స్క్వేర్, హనుమాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లతో వావ్ అనిపిస్తే.. మలయాళం నుంచి మంజుమెల్ బాయ్స్, ప్రేమలు వంటి సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలని తెచ్చిపెట్టాయి.కాగా ఈ సినిమాలు కేవలం భారీ విజయాన్ని నమోదు చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా ఆడియన్స్ లో కూడా చాలా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి. దీంతో ఈ క్రేజ్ ని కాష్ చేసుకోవడం కోసం మేకర్స్ వాటికీ సీక్వెల్స్ ని కూడా తీసుకు వచ్చేస్తున్నారు.


ఈ క్రమంలోనే డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ వచ్చి భారీ హిట్ అయ్యింది.125 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టింది. మూవీ టీం ఇప్పుడు మళ్ళీ టిల్లు క్యూబ్ని కూడా ప్రకటించింది. ఇక ఇటీవల మ్యాడ్ మూవీకి కూడా సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అంటూ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇక తాజాగా మలయాళ సూపర్ హిట్ ప్రేమలు సినిమాకి కూడా సీక్వెల్ ని ప్రకటించేసారు. 2025లో ప్రేమలు 2 సినిమా రాబోతుంది అంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసారు. ఇక హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ వస్తుంది. మరి ఈ సీక్వెల్స్.. ఫస్ట్ మూవీలా ఆడియన్స్ ని అలరించి ఆకట్టుకుంటాయా లేదో అనేది చూడాలి. గతంలో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేదా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే సీక్వెల్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు కంటెంట్ బాగుంటే ఎంత చిన్న సినిమా అయినా ఆడుతుంది కాబట్టి మంచి కంటెంట్ తో ఇలా చిన్న సినిమాలకు కూడా సీక్వెల్స్ చేస్తున్నారు.మరి ఈ సీక్వెల్స్ ఏ విధంగా జనాలని మెప్పిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: