టాలీవుడ్ లో ప్రస్తుతం రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన చిత్రాలు ఇప్పుడు మరోసారి మళ్లీ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.అద్భుతమైన కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. ఈ రీ రిలీజ్ ట్రెండ్ తమిళ్ ఇండస్ట్రీ కి కూడా పాకింది. తాజాగా దళపతి విజయ్ హీరోగా నటించిన 'గిల్లీ' చిత్రం ఏప్రిల్ 20న థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. 20 ఏళ్ల తర్వాత మరోసారి ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం రీ-రిలీజ్‍ అవుతున్న సినిమాలలో.’గిల్లి’ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది.గిల్లీ చిత్రం రీ-రిలీజ్ తొలిరోజున భారీ వసూళ్లు వచ్చాయి. ఏకంగా ఈ సినిమా ఫస్ట్ డే సుమారు రూ.10కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రీ-రిలీజ్ చిత్రం ఈ రేంజ్‍లో వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. 

దళపతి విజయ్‍కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో గిల్లి చిత్రం మరోసారి నిరూపించింది.తెలుగు బ్లాక్ బస్టర్ మూవీస్ ఖుషి, బిజినెస్‍మ్యాన్ గతేడాది రీ-రిలీజ్ సమయంలో తొలి రోజు సుమారు రూ.4కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించాయి. దీంతో రీ-రిలీజ్ మూవీ అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ల రికార్డు ఆ సినిమాల పేరు మీద ఉండేది.తాజాగా దళపతి విజయ్ మూవీ గిల్లీ ఆ రికార్డును బద్దలుకొట్టింది. రీ-రిలీజ్ అయిన తొలి రోజే సుమారు రూ.10కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఇండియాలోనే రీ-రిలీజ్ విషయంలో అత్యధిక ఓపెనింగ్ డే రికార్డును గిల్లీ చిత్రం దక్కించుకుంది.తమిళ్ మూవీ అయిన 'గిల్లీ' 2004 ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో దళపతి విజయ్‍కు జోడీగా క్యూట్ బ్యూటీ త్రిష నటించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఒక్కడు చిత్రానికి రీమేక్‍గా గిల్లీ మూవీ రూపొందింది. ఈ చిత్రం అప్పట్లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ అయినా కూడా అదే జోరు కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: