పాన్ ఇండియన్ చేస్తున్నపుడు.. దానికోసం 400 కోట్లు ఖర్చు చేస్తున్నపుడు.. వేసుకునే ప్లానింగ్స్ కూడా అదే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు కొరటాల శివ కూడా ఇదే చేస్తున్నారు.దేవర కోసం ఈయన ప్లానింగ్ చూస్తుంటే మతి పోతుంది. పైగా అదిరిపోయే పాన్ ఇండియన్ సెంటిమెంట్ తోడు తెచ్చుకుంటున్నారు కొరటాల. మరి ఏంటా సెంటిమెంట్..? ఇంతకీ దేవర ప్లాన్ ఏంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్.. ట్రిపుల్ ఆర్‌లో ఎన్టీఆర్‌ను ఈ రేంజ్‌లో చూసాక.. నెక్ట్స్ ఎలా చూసినా కాస్త తక్కువే అనిపిస్తుంది.
పాన్ ఇండియన్ చేస్తున్నపుడు.. దానికోసం 400 కోట్లు ఖర్చు చేస్తున్నపుడు.. వేసుకునే ప్లానింగ్స్ కూడా అదే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు కొరటాల శివ కూడా ఇదే చేస్తున్నారు. దేవర కోసం ఈయన ప్లానింగ్ చూస్తుంటే మతి పోతుంది. పైగా అదిరిపోయే పాన్ ఇండియన్ సెంటిమెంట్ తోడు తెచ్చుకుంటున్నారు కొరటాల. మరి ఏంటా సెంటిమెంట్..? ఇంతకీ దేవర ప్లాన్ ఏంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్..

 ట్రిపుల్ ఆర్‌లో ఎన్టీఆర్‌ను ఈ రేంజ్‌లో చూసాక.. నెక్ట్స్ ఎలా చూసినా కాస్త తక్కువే అనిపిస్తుంది. కానీ ఈ లోటు కనిపించకుండా చేస్తానంటున్నారు కొరటాల. మీరెంతైనా ఊహించుకోండి.. దానికి ఓ మెట్టు పైనే ఉంటుంది దేవర అంటూ మాటిస్తున్నారీయన. ఈ మధ్య ఎక్కడికి వచ్చినా.. తారక్ కూడా ఇదే మాట చెప్తున్నారు. కాలర్ ఎగరేద్దాం అంటున్నారు యంగ్ టైగర్.చూస్తున్నారుగా.. దేవరపై తారక్ కాన్ఫిడెన్స్. కొరటాల శివ మాస్ ప్లానింగ్ కూడా అదే స్థాయిలో నడుస్తుంది. ఇండియన్ కు సరికొత్త యాక్షన్ బొమ్మను చూపించాలని ఫిక్సైపోయారు మేకర్స్. సీ బ్యాక్‌డ్రాప్‌లో నడచే కథ కావడంతో.. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను వాడుకుంటున్నారు కొరటాల. ఇక అంతా సీరియస్ టోన్‌లోనే సాగుతుందని తెలుస్తుంది.

 కమర్షియల్ పేరుతో అనవసరంగా కామెడీలు, డాన్స్ అంటూ పోకుండా.. స్టోరీ డ్రివెన్‌గా దేవరను తెరకెక్కిస్తున్నారు కొరటాల. కొన్నేళ్ళుగా పాన్ ఇండియా లకు ఇదే కలిసొస్తుంది కూడా. పుష్ప, కేజియఫ్, సలార్, ట్రిపుల్ ఆర్ లాంటి ల్లో రొటీన్ కమర్షియల్ స్టఫ్ ఉండదు.. కథ అంతా సీరియస్ టోన్‌లో.. ఎమోషనల్‌గా వెళ్తుంది.దేవరలోనూ ఎమోషన్స్‌కి పెద్దపీట వేస్తున్నారు కొరటాల. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దేవర 1లో కొడుకు కథ చెప్పి.. పార్ట్ 2లో తండ్రి కథ చెప్పనున్నట్లు తెలుస్తుంది. ఆచార్య తర్వాత వస్తున్న కావడంతో.. తారక్ కంటే కొరటాలకే దేవర కీలకంగా మారింది. అక్టోబర్ 10న ఈ విడుదల కానుంది. మొత్తానికి చూడాలిక.. సీరియస్‌గా దేవర ఏం చేస్తాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: