రష్మి గౌతమ్... ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది జబర్దస్త్ కామెడీ షో. అంతకంటే ముందే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది ఈ బ్యూటీ.తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ శారీలో నడుము అందాలు చూపిస్తూ బ్యూటిఫుల్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది రష్మీ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాటిపై ఓ లుక్కెయ్యండి.ఓవైపు తనదైన శైలిలోని యాంకరింగ్ చేస్తూ మరోవైపు అడపా దడపా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ జబర్దస్త్ మాత్రమే కాకుండా ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి బుల్లితెర షోలకు హోస్టుగా వ్యవహరించిన రష్మీ సినిమాల ద్వారా అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంది.

చారుశీల మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రష్మీ హీరోయిన్ గా గుంటూరు టాకీస్ మూవీతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తరువాత రాజు గారి బంగ్లా, తను వచ్చెనంట, అంతం, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి వంటి సినిమాల్లో నటించింది. కానీ ఒక్క మూవీ కూడా హిట్ కాకపోవడంతో మళ్ళీ బుల్లితెరపైనే ఫోకస్ పెట్టింది. రష్మీ చివరగా బాయ్స్ హాస్టల్ మూవీలో మెరిసింది. ఈ మూవీ 2003లో రిలీజ్ అయ్యింది.ఇక సినిమాలు, షోల సంగతి ఇలా ఉంటే తరచుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది రష్మీ గౌతమ్. కావలసినంత సామాజిక స్పృహ ఉన్న ఈ బ్యూటీ ఒక్క మూగ జీవాలపైనే కాకుండా మహిళలపై జరిగే అకృత్యాలపై కూడా గళం విప్పుతూ ఉంటుంది.

అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా తన గురించి పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తే అక్కడే ఇచ్చి పడేస్తుంది. తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే రష్మీ ఎవరైనా తన గురించి నెగెటివ్ గా కామెంట్స్ చేస్తే అస్సలు ఊరుకోదు. కానీ జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం నడిపిస్తుంది అనే రూమర్లు మాత్రం ఫుల్లుగా హల్చల్ చేశాయి. ఆ రూమర్లు వచ్చిన తర్వాతే రష్మికి ఈ రేంజ్ లో పాపులారిటీ దక్కింది అనేది మాత్రం వాస్తవం.ఇక మరోవైపు రష్మీ పెళ్లి, ఆమె బిగ్ బాస్ ఎంట్రీ అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ 7లో ఆఫర్ రాగా, దానికామె భారీ రెమ్యూనరేషన్ అడిగిందని వార్తలు వచ్చాయి. మరి ఈసారైనా ఆమె బిగ్ బాస్ లో కనిపిస్తుందా అనేది చూడాలి.ఇక టీవీ యాంకర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న రష్మీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి బ్లాక్ కలర్ సారీ లో ఉన్న బ్యూటిఫుల్ ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో రష్మిని చూసిన వాళ్లు నిండు పున్నమిలో జాబిలమ్మలా అందంగా కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: