టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా మెరిసింది.అనసూయ, రష్మీ, శ్రీముఖి తరహాలో శ్యామల అతిగా గ్లామర్ ప్రదర్శించదు. నటుడు నరసింహారెడ్డిని శ్యామల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు సంతోషంగావైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. శ్యామల కెరీర్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వెళుతోంది.వివాదాలకు దూరంగా ఉండే శ్యామలకి కూడా సోషల్ మీడియా వల్ల ఇబ్బందులు తప్పలేదు. ఒక దశలో యాంకర్ శ్యామలని అశ్లీల చిత్రాలతో ముడిపెడుతూ ట్రోలింగ్ చేశారు. ఆ సమయంలో తాను చాలా డిస్ట్రబ్ అయినట్లు శ్యామల తెలిపింది. ఇటీవల ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా మంచి ఫ్లాట్ ఫామ్. కానీ దాని వల్ల తాను పర్సనల్ లైఫ్ లో ఇబ్బంది పడ్డట్లు తెలిపింది.

 ఇంట్లో వాళ్ళతో పబ్ కి వెళ్లినా నన్ను టార్గెట్ చేస్తారు. నేను నా భర్తతో కలసి పబ్ కి వెళతా.. క్యాసినో ఆడతా.. ఫారెన్ లోతిరుగుతాం. ఆన్ స్క్రీన్ నేను ట్రెడిషనల్ గానే ఉంటాను. కానీ ఆఫ్ స్క్రీన్ నేను నాకు నచ్చినట్లుగా.. నా భర్తకి నచ్చినట్లుగా ఉంటా. నా ప్రైవేట్ పిక్ ఒకటి వైరల్ చేశారు. అవకాశాల కోసం శ్యామల ఇలా చేస్తోంది అంటూ అసభ్యంగా క్రియేట్ చేశారు.బ్లూ ఫిలింలో ఒక బాడీకి నా పేస్ అతికించి వైరల్ చేశారు. అది నా భర్త దృష్టికి వెళ్ళింది. ఆయనే నాకు చెప్పారు.. నీ గురించి ఒక గాసిప్ వచ్చింది.. ఒకసారి చూసి నవ్వుకో అన్నారు. నా భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి ఆయన అర్థం చేసుకున్నారు. కానీ ఇలా నన్ను సోషల్ మెయిద్యాలోకి లాగడంతో చాలా బాధపడ్డట్లు శ్యామల తెలిపింది.తన భర్త తనకి ఎంతో సపోర్టివ్ గా ఉంటారని తెలిపింది. శ్యామల చివరగా విరూపాక్ష చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రకి మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: