తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ తాజాగా గామి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ యువ నటీమణి చాందిని చౌదరి ఓ కీలకమైన పాత్రలో నటించగా ... విద్యాధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా ఈ మూవీ కి వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 4.12 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.12 కోట్లు ... ఉత్తరాంధ్ర లో 86 లక్షలు ... ఈస్ట్ లో 67 లక్షలు ... వెస్టు లో 40 లక్షలు ... గుంటూరు లో 45 లక్షలు ... కృష్ణ లో 44 లక్షలు , నెల్లూరు లో 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 8.36 కోట్ల షేర్ ... 15.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 95 లక్షలు , ఓవర్ సీస్ లో 2.51 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 11.82 కోట్ల షేర్ ... 23.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 10.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 82 లక్షల లాభాలను అందుకొని హిట్ సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs