మ్యాచ్ స్టార్ గోపీచంద్ తాజాగా బీమా అనే పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్ లు హీరోయిన్ లుగా నటించగా ... కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ మూవీ కి ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి..? ఎన్ని కోట్ల నష్టాలు వచ్చాయి అని వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసేసరికి నైజాం ఏరియాలో 3.01 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.30 కోటి ... ఏపీ లో 3.40 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.71 కోట్ల షేర్ ... 13.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 75 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 8.46 కోట్ల షేర్ ... 15.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఆ టార్గెట్ ను అందుకోలేకపోయింది. దానితో ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 3.54 కోట్ల నష్టాలను అందుకొని యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: