మలయాళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) అనే వైవిద్యమైన సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి బ్లేస్సి దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. జిమ్మీ జీన్ - లూయిస్ , రిక్ అబీ తదితరులు కీలక పాత్రలలో నటించిన పోషించిన ఈ మూవీ ని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్ , జెట్ మీడియా ప్రొడక్షన్ మరియు ఆల్టా గ్లోబల్ మీడియా నిర్మించాయి. 

మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే థియేటర్ లలో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ సినిమా స్లో అండ్ స్టడీగా వరల్డ్ వైడ్ గా కలెక్షన్ లను రాబడుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 25 రోజులు కూడా ఈ సినిమా మంచి కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కాబట్టి రాబట్టింది. ఇక తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 25 రోజుల్లో వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన ఆఫైసియల్ అనౌన్స్మెంట్ ను విడుదల చేసింది.

మూవీ కి 25 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 150 ప్లస్ కోట్ల కలెక్షన్ లు దక్కినట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో "ఆడు జీవితం" అనే పేరుతో విడుదల అయ్యింది. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా భాగానే ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ps