సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా మహేష్ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో పోకిరి మూవీ ఒకటి. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా , మహేష్ కి జోడిగా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజు విలన్ పాత్రలో నటించగా ... నాజర్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ 2006 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని రేంజ్ కలెక్షన్ లను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇకపోతే అంతటి ఇంపాక్ట్ ను ఆ రోజుల్లో క్రియేట్ చేసిన ఈ సినిమాకు మొదటగా పోకిరి కాకుండా వేరే టైటిల్ ను అనుకున్న విషయం మీకు తెలుసా..? మొదట పోకిరి మూవీ కి "ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ" అనే టైటిల్ ను అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో ఈ టైటిల్ ను కాకుండా పోకిరి అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారట. ఇకపోతే ఈ మూవీ లోని మహేష్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: