మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి నుపుర్ సనన్ , గాయత్రీ భరద్వాజ్ లు హీరోయిన్ లుగా నటించగా ... వంశీమూవీ కి దర్శకత్వం వహించాడు. రేణు దేశాయ్ , నాజర్ , అనుపమ కేర్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది.

మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విపలం అయ్యింది. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విఫలం అయినప్పటికీ ఈ సినిమాలో రవితేజ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా ధియేటర్ రిలీజ్ సమయంలో హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా హిందీ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరిస్తోంది. ఈ మూవీ ని హిందీ వెర్షన్ ను కొన్ని రోజుల క్రితమే యూట్యూబ్ లో విడుదల చేశారు.

సినిమా యూట్యూబ్ లో విడుదల అయినా చాలా తక్కువ రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇలా థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో కాస్త విఫలం అయిన ఈ సినిమా యూట్యూబ్ లో మాత్రం హిందీ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt