కొన్ని రోజుల క్రితమే మలయాళం లో పెద్ద అంచనాలు లేకుండా విడుదల అయిన మంజుమ్మల్ బాయ్స్ అనే సినిమా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఈ సినిమా మలయాళం లో ఇప్పటి వరకు ఏ సినిమా కలెక్ట్ చేయని కలెక్షన్ లను వసూలు చేసి మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా అందరి దృష్టి పడింది.

ఇక ఈ సినిమాను ఇప్పటికే తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే తెలుగు ప్రేక్షకుల నుండి కూడా సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా మే 3 వ తేదీ నుండి ఈ సినిమాను ఈ సంస్థ వారు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువబడింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ వారు దక్కించుకుంది. కాకపోతే ఈ సినిమాను ఏ తేదీ నుండి  స్ట్రీమింగ్ చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సంస్థ వారు చెప్పలేదు. త్వరలోనే ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb