లోక నాయకుడు కమల్ హాసన్ కొంత కాలం క్రితం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే సినిమాలో హీరోగా నటించిన అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత కమల్ వరుస పెట్టి సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే కమల్ విక్రమ్ సినిమా కంటే ముందే శంకర్ దర్శకత్వంలో "ఇండియన్ 2" అనే మూవీ ని మొదలు పెట్టాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

ఇక విక్రమ్ సూపర్ హిట్ విజయం సాధించడంతో కమల్ క్రేజ్ ఒక్క సారిగా పెరగడంతో మళ్లీ తిరిగి "ఇండియన్ 2" ను ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటికే "ఇండియన్ 2" సినిమాకు సంబంధించిన షూటింగ్ మరియు ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  ఇకపోతే కమల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న "కల్కి 2898 ఏడి" సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.

ఇకపోతే ఈ సినిమాను కూడా ఈ సంవత్సరం జూన్ నెలలోనే విడుదల చేసే ఆలోచన లో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మరో కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . ఒక వేళ ఈ వార్త కనుక నిజం అయినట్లు అయితే కమల్ నటించిన రెండు క్రేజీ మూవీ లు ఒకే నెలలో విడుదల అవుతాయి. ఈ వార్త కనుక నిజం అయితే ఇది కమల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ అమే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: