నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో నటించింది.

మూవీ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఇకపోతే ఈ మూవీ లోని శ్రీ లీల నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. మొదట ఈ సినిమాలో శ్రీ లీల పాత్రకు మరో నటిని అనుకున్నారట. ఆ నటి మరెవరో కాదు కృతి శెట్టి. ఈ సినిమా కథ మొత్తం పూర్తి అయ్యాక ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి ఇందులో కృతి శెట్టి అయితే చాలా బాగుంటుంది అని భావించారట. అందులో భాగంగా ఈమెను కలిసి కథ మొత్తం కూడా వివరించారట.

కథ మొత్తం విన్నాక కృతి శెట్టి... సినిమా స్టోరీ సూపర్ గా ఉంది. అందులో బాలకృష్ణ హీరోగా నటించడం... తన పాత్ర కూడా చాలా సూపర్ గా ఉండడంతో ఈ మూవీ చేయాలి అని అనుకుందట. కాకపోతే అదే సమయంలో ఇతర మూవీలతో చాలా బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకు తేదీలను అడ్జస్ట్ చేయలేక నటించాలని ఇష్టం ఉన్నా కూడా భగవంత్ కేసరి మూవీ ని కృతి శెట్టి మిస్ చేసుకుందట. ఇకపోతే ప్రస్తుతం కృతి శెట్టి , శర్వానంద్ హీరోగా రూపొందుతున్న మనమే అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: