లైగర్’ ఘోర పరాజయంతో పూరీ జగన్నాథ్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. ఒకప్పుడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉండే పూరీ కెరియర్ అయోమయంలో పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హీరో రామ్ తో డబుల్ ‘ఇస్మార్ట్’ ను తీస్తున్న పూరీ ఈసినిమాను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాడు అంటూ చాలమంది ఆశ్చర్యపోతున్నారు.తాను తీసే సినిమాలను అత్యంత వేగంగా పూర్తి చేస్తాడు అని పేరున్న పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ ఫిబ్రవరిలో విడుదలకావలసి ఉంది. ఆతరువాత ఏప్రియల్ అని అన్నారు ఆపై జూన్ కు వాయిదా పడింది అని వార్తలు కూడా వచ్చాయి. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఈమూవీకి సంబంధించి ఇంకా 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ తో పాటు ఇంకా రెండు పాటలు చిత్రీకరింపలసి ఉంది అంటూ లీకులు వస్తున్నాయి.ఈ పెండింగ్ షూటింగ్ పూరీ జగన్నాథ్ పూర్తి చేసే విషయంలో ఎందుకు తొందరపడటం లేదు అన్న సందేహం చాలామందికి కలుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈమూవీకి ఓవర్ బడ్జెట్ అయిపోయిందని దీనితో భారీ రేట్లకు ఈమూవీని బయ్యర్లకు అమ్మవలసి రావడంతో బయ్యర్లు ఈమూవీని కొనె విషయంలో వెనకడుగు వేస్తూ ఉండటంతో ఈ మూవీ బిజినెస్ పూర్తి కాలేదు అని కూడ కొందరు అంటున్నారు.ఇక ఈ మూవీని విడుదలకు ముందే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మాలని ఈమూవీ నిర్మాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఈమూవీ పట్ల ఏప్రముఖ ఓటీటీ సంస్థ ముందుకు రాకపోవడంతో జరుగుతున్న పరిణామాలు పూరీ జగన్నాథ్ కు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. రామ్ గత సంవత్సరం నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో పాటు బోయపాటి దర్శకత్వంలో రామ్ నటించిన ‘స్కంద’ మూవీ కూడ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో రామ్ అదేవిధంగా బోయపాటి శ్రీను కూడ ఆషాక్ నుండి బయటకు రాలేకపోతున్నారు. దీనితో కొన్ని వారాలు ఆలస్యం అయినా హిట్ కొట్టి తీరాలి అన్న రామ్ పూరీ ల నిర్ణయంతో ఈమూవీ రిలీజ్ కొంతవరకు అయోమయంలో పడిపోయింది అని అంటున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: