ప్రతి వారం లా గానే ఈ వారం కూడా అనేక సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అందులో భాగంగా ఈ వారం రెండు తెలుగు క్రేజీ సినిమాలు కూడా "ఓ టి టి" లోకి విడుదల కానున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఆ సినిమాలు ఏవి..? అవి ఏ తేదీన ఏ "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మ్యాచ్ స్టార్ గోపీచంద్ తాజాగా భీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ , మాళవికా శర్మ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ సంస్థ వారు ఏప్రిల్ 25 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో డిజె టిల్లు మూవీ కి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మార్చి 29 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఏప్రిల్ 26 వ తేదీ నుండి ఈ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇలా ఈ వారం ఈ రెండు తెలుగు క్రేజీ సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: