ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టు గా నటించాడు . వాటితోనే మంచి స్థాయిని సంపాదించుకున్న ఈ నటుడు ప్రస్తుతం వరుస సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. అందులో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినటువంటి హనుమాన్ సినిమాలో హీరో గా నటించిన ఈయన ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొ ని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇలా హనుమాన్ సినిమాతో మంచి విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ యువ నటుడు ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది . ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక చిన్న వీడియోని విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది . ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మూవీ లో మలయాళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న దుల్కర్ సల్మాన్ ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఈయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే మహానటి , సీత రామం అనే రెండు తెలుగు సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకొని సూపర్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన లక్కీ భాస్కర్ అనే తెలుగు సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: