తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి దిల్ రాజు తన సోదరుడు కుమారుడిని రౌడీ బాయ్స్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. దిల్ రాజు సోదరుడు కుమారుడు అయినటువంటి ఆశిష్ హీరోగా రూపొందిన రౌడీ బాయ్స్ సినిమాకి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వర ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. 

ఇందులో తన నటనతో కూడా ఆశిష్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇకపోతే అనుపమ మాత్రం ఈ సినిమాలో తన అందాలను భారీగా ఆరబోసింది. ఈ సినిమా ముందు వరకు చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలలో డీసెంట్ పాత్రలలో నటిస్తూ వచ్చిన ఈమె ఈ సినిమాలో ఏకంగా అనేక ముద్దు సన్నివేశాలలో పాల్గొని కుర్రకారుకి హిట్ పెంచింది. ఈమె అందాల ఆరబోత కూడా ఈ సినిమాకు మంచి బజ్ ను తీసుకువచ్చింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోలేక పోయింది.

ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాని ఏప్రిల్ 25 వ తేదీన మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. మరి ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా ఏ రేంజ్ ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: