ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమాలలో దేవర మూవీ ఒకటి. ఈ మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ ఉండగా, కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా థియేటర్ లలో విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగం కు సంబంధించిన చిత్ర షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొదటి భాగంలో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

దాని కోసం ఇప్పటికే అనురీధ్ అద్భుతమైన ట్యూన్ ను కూడా ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ సాంగును చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినటువంటి పూజా హెగ్డే ను తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ప్రస్తుతం అందులో భాగంగా ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే గతంలో పూజా హెగ్డే , రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం మూవీలోను... వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 3 మూవీలను ఐటమ్ సాంగ్లలో నటించింది. ఇందులో ఈ బ్యూటీ తన అందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మరి ఈమె దేవర సినిమాలో ఐటెం సాంగ్ లో పూజ హెగ్డే నటిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: