పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీని పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పై బండ్ల గణేష్ నిర్మించాడు. ఈ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ విజయం సాధించినటువంటి దబాంగ్ మూవీకి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో ఈయన అందించిన సంగీతం కూడా చాలా ముఖ్యపాత్రను పోషించింది.

 ఇకపోతే ఈ మూవీ కంటే ముందు పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన సమయంలో పవన్ కి ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఇకపోతే మొదట ఈ సినిమాలో పవన్ ని కాకుండా మరో నటుడుని హీరోగా అనుకున్నారు అనే విషయం మీకు తెలుసా..? అతను ఎవరు ..? అసలు ఎందుకు మొదట అనుకున్న హీరో కాకుండా పవన్ కళ్యాణ్ ఇందులో నటించాడు అనే వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్ కు సోనీ మంచి స్నేహితుడు. దానితో ఒకరోజు ఆయన హిందీలో దబాంగ్ మూవీ వచ్చింది.

 అది సూపర్ గా ఉంది దానిని కొనుక్కో అని అన్నారట. దానితో వెంటనే దానిని కొని గణేష్ , రవితేజతో దీనిని తీయాలి అని కథను కూడా చెప్పాడట. రవితేజ కూడా ఓకే అన్నాడట. కానీ అదే సమయంలో పవన్ ఏదైనా ఒక మంచి కథ ఉంటే చెప్పు సినిమా చేద్దాం అని గణేష్ అన్నారట. దానితో దబాంగ్ కథ చెప్పడం, ఆయనకు కూడా నచ్చడం జరిగిందట. దానితో బండ్ల గణేష్, రవితేజకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో ఓకే అన్నారట. దానితో పవన్ కళ్యాణ్ హీరోగా దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: