మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి చాలా సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇక ఈమె తన కెరియర్ లో ఎన్నో విజయాలను అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్గా కొనసాగినప్పటికీ ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలతోనే కెరియర్ను ముందుకు సాగించింది.

ఒకటి, రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కాజల్ నటించినా కూడా వాటి ద్వారా ఈమెకు పెద్ద స్థాయి గుర్తింపు ఏమీ దక్కలేదు. ఇక దానితో ఈమె కూడా కమర్షియల్ సినిమాలలోనే నటించడం మేలు అని వాటిలోనే నటిస్తూ కెరియర్ను ముందుకు సాగించింది. ఇలా కెరియర్ ముందుకు సాగుతున్న సమయంలోనే ఈ బ్యూటీ తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి గౌతమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక బిడ్డ కూడా జన్మించింది. ఇకపోతే పెళ్లి , ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కూడా ఈమె వరస సినిమాల్లో నటిస్తోంది.

అందులో భాగంగా కొంతకాలం క్రితమే భగవంత్ కేసరి అనే మరో కమర్షియల్ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ప్రస్తుతం సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఈమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాను మే 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈమెకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు.

మరి సత్యభామ మూవీతో అయినా ఒక అద్భుతమైన విజయాన్ని అందుకొని లేడీ ఓరియంటెడ్ జోనర్ కాజల్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. ఇప్పటివరకు సత్యభామ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి  దానితో ఈ మూవీపై ప్రేక్షకులు పరవాలేదు అనే స్థాయిలో అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: