తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన బ్యూటీలలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె చందమామ మూవీ తో మొదటి విజయాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ లో తన అందంతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈమెకు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా రూపొందిన మగధీర మూవీ లో అవకాశం వచ్చింది. ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కావడం ఇందులో కూడా ఈమె నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఒక్క సారిగా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పెరిగిపోయింది. 

వరుసగా ఈమెకు తెలుగు టాప్ హీరోల సరసన హీరోయిన్ అవకాశాలు దక్కడం , అందులో చాలా వరకు సూపర్ సక్సెస్ కావడంతో ఈమె ఎన్నో సంవత్సరాలు తెలుగు లో టాప్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది. తెలుగులో మాత్రమే కాకుండా కాజల్ ఎన్నో తమిళ , హిందీ సినిమాలలో కూడా నటించింది. ఇక కొంతకాలం క్రితమే ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ 17 వ తేదీన విడుదల కానుంది. 

ఇది ఇలా ఉంటే పెళ్లి తర్వాత సినిమాల్లో స్కిన్ షో తో ఎక్కువగా ప్రేక్షకులను పెద్దగా అలరించని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: