విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకుండా విడుదల తర్వాత ఇండియా వ్యాప్తంగా సంచనాలను సృష్టించిన సినిమా "కే జీ ఎఫ్ చాప్టర్ 1" ఈ మూవీ లో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ హీరో గా నటించగా ... ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు ముందు పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడమే రిలీజ్ అయ్యింది. కాకపోతే ఎప్పుడయితే ఈ సినిమా విడుదల అయ్యిందో ఈ మూవీ కి దేశ వ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. 

దానితో మెల్లి మెల్లిగా ఈ సినిమా కలెక్షన్ లు భారీగా పెరిగాయి. చివరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఓ భారీ విజయాన్ని అందుకుంది. 2018 వ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచాలనాలను సృష్టించిన ఈ సినిమాను మళ్ళీ తెలుగులో ఓ థియేటర్లో విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని హైదరాబాదు , ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎంఎం లో ఏప్రిల్ 27 వ తేదీన ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

మరి ఏప్రిల్ 27 వ తేదీన హైదరాబాదు లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 ఎంఎం లో ప్రదర్శించనున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ మూవీ కి కొనసాగింపుగా "కే జీ ఎఫ్ చాప్టర్ 2" అనే మూవీ కూడా రూపొందింది. "కే జీ ఎఫ్ చాప్టర్ 1" సూపర్ సక్సెస్ కావడంతో చాప్టర్ 2 పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  "కే జి ఎఫ్ చాప్టర్ 2" సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: