లోక నాయకుడు కమల్ హాసన్ ఆఖరుగా విక్రమ్ అనే మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా కంటే ముందు వరస అపజయాలతో డీలాపడిపోయిన కమల్ ఈ మూవీ విజయంతో తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత ఈయన వరుస సినిమాలను ఓకే చేశాడు. అందులో మణిరత్నం దర్శకత్వంలో "దగ్ లైఫ్" అనే మూవీ ఒకటి. ఈ సినిమా చిత్రీకరణను ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితం ప్రారంభించింది.

ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ ను కూడా ముగించింది. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఎలక్షన్స్ రావడంతో కమల్ వాటిపైన ఫోకస్ పెట్టాడు. దానితో ఇన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కొన్ని రోజుల క్రితమే తమిళ నాడు లో ఎలక్షన్ లు పూర్తి కావడంతో మళ్ళీ కమల్ తిరిగి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ఢిల్లీలో ప్రారంభం అయ్యింది. ఇక్కడే ఈ సినిమా యూనిట్ చాలా రోజుల పాటు షూటింగులు తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో వచ్చే యాక్షన్స్ సన్నివేశం కోసం ఈ చిత్ర బృందం సెర్బియా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం , కమల్ కాంబోలో 37 సంవత్సరాల క్రితం నాయకుడు అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 37 సంవత్సరాల తర్వాత నాయకుడు కాంబో రిపీట్ అవుతూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతం తమిళ ప్రేక్షకులు భారీ అంతరాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: