తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో హీరో గా నటించినప్పటికీ వాటి ద్వారా ఈయనకు భారీ స్థాయిలో గుర్తింపు లభించలేదు. అలాంటి సమయం లోనే ఈయన విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన డిజె టిల్లు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో ఒక్క సారిగా ఈ నటుడి క్రేజ్ తెలుగు లో భారీగా పెరిగిపోయింది.

ఇందులో నేహ శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే మూవీ ని అనౌన్స్ చేశారు. దానితో ఈ సినిమాకు కూడా విమల్ కృష్ణ అనే దర్శకత్వం వహిస్తాడు అని అంతా భావించారు. కానీ చివరకు సీన్ రివర్స్ అయ్యింది. టిల్లు స్క్వేర్ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. అనుపమ పరమేశ్వరం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఈ సినిమాకు కొనసాగింపుగా తాజాగా టిల్లు క్యూబ్ అనే మూవీ చేశారు. ఇక దీనికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ టిల్లు క్యూబ్ మూవీ కి మ్యాడ్ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది అని ప్రస్తుతం ఈయన ఇందుకోసం ఈ దర్శకుడు వర్క్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj