తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్న వారిలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈమె నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలలో అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టి కి జంటగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించిన ఈమె తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఈమెకు తెలుగులో పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న ఎన్నో సినిమాలలో అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ బ్యూటీ వరుస ఇంటర్వ్యూలలో , టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరియా తన టాటూ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఫరియా కాలుకు చెట్టు వేల లాంటి సింబల్ తో ఓ టాటూ ఉంది.

దాని గురించి ఈమె వివరిస్తూ ... పేర్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం అంతా ఎత్తుకు ఎదగగలం. మనం ఎంత స్థాయిలో ఉన్న నేలను మరవద్దని అది నాకు గుర్తు చేసేందుకు ఈ టాటూను వేసుకున్నట్లు ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇకపోతే ఆ ఒక్కటి అడక్కు మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Fa