గోవా బ్యూటీ ఇలియానా, రామ్ పోతినేని హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. 2006 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాకు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో చక్రి అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది.

ఇక ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం, ఇందులో ఇలియానా తన నటనతో, అంతకుమించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె ఆ తర్వాత నటించిన పోకిరి మూవీ కూడా సూపర్ సక్సెస్ కావడంతో చాలా తక్కువ కాలంలోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్థాయికి వెళ్లిపోయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలోకి దేవదాసు మూవీ తో ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన రీతిలో కెరియర్ ను కొనసాగించిన ఈమె తెలుగు లోకి దేవదాసు కంటే ముందే ఎంట్రీ ఇవ్వాల్సిందట. కాకపోతే ఈమె హీరోయిన్ గా అనుకున్న ఒక సినిమా క్యాన్సల్ అయ్యిందట. ఆ వివరాలు తెలుసుకుందాం. తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా ధైర్యం అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మొదట ఇలియానానే హీరోయిన్ గా అనుకున్నారట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈమెను తీసి వేసి ఆ స్థానంలో వేరే వాళ్ళను తీసుకున్నారట. దానితో ధైర్యం మూవీ తో తెలుగు తెరకు పరిచయం కావాల్సిన ఈమె దేవదాసు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: