మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి హర్ష దర్శకత్వం వహించగా ... ప్రియ భవాని శంకర్ , మాళవికా శర్మ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ మార్చి 8 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది. కాకపోతే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్ లను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టడంలో విఫలం అయ్యింది.

దానితో ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ వారు ఈ సినిమాని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ భాషలలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో భారీగా సక్సెస్ కాలేకపోయినా ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మీ ఆయన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc