తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు అనే పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేయగా , ఇది చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఒక్క సారిగా జనాల్లో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరొక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ విషయంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబాదు లో పది రోజుల పాటు ప్లాన్ చేసినట్లు , ఇందులో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్లు , ఈ ఒక్క యాక్షన్ సన్నివేశం కోసమే దాదాపు 8 కోట్ల బడ్జెట్ ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది. నితిన్ మూవీ కెరియర్ లోనే ఒక్క యాక్షన్స్ సన్నివేశం కోసం 8 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమా ఇదే అయ్యి ఉంటుంది అని , ఇంత బడ్జెట్ తో ఈ యాక్షన్స్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి మేకర్స్ డిసైడ్ అయ్యారు అంటే ఈ ఫైట్స్ అన్నివేశం ఏ రేంజ్ లో ఉంటుందో , అలాగే ఈ సినిమా కథ , కథనాలు బలంగా లేనట్లు అయితే ఇంత బడ్జెట్ పెట్టి యాక్షన్ సన్నివేశం తీసే అవకాశం లేదు అని కొంత మంది అనుకుంటున్నారు  మరి ఈ యాక్షన్ సన్నివేశం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: