మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నవీన్ చంద్ర ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా , సుమన్ చిక్కాల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని మే 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. 

తాజాగా ఈ చిత్ర బృందం ఈ మూవీ లోని సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ లోని కల్లారా అంటూ సాగే సాంగ్ ను ఈ రోజు అనగా ఏప్రిల్ 25 వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 06 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కాజల్ మరియు నవీన్ చంద్ర ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో కాజల్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. కాజల్ ఇప్పటి వరకు చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది. అందులో ఏవి భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మరి సత్యభామ మూవీ కాజల్ కి ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: