టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. అలాంటి సమయం లోనే ఈయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చార్మి ప్రధాన పాత్రలో రూపొందిన జ్యోతిలక్ష్మి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , అందులో సత్యదేవ్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు రావడంతో ఆ తర్వాత నుండి ఈయనకు తెలుగులో సినిమా అవకాశాలు బాగా పెరిగాయి. 

అందులో భాగంగా ఈయన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం , ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడంతో ప్రస్తుతం సత్యదేవ్ తెలుగు లో మోస్ట్ బిజీయేస్ట్ నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి వి వి గోపాల కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 3 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.

మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 26 వ తేదీన సాయంత్రం 5 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ తో సత్యదేవ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. కొంత కాలం క్రితం సత్యదేవ్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో విలన్ పాత్రలో నటించిన సత్యదేవ్ కి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: